Indian 2 | పాన్ ఇండియాతోపాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీకి శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
ఇటీవలే చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించిన కమల్ హాసన్ టీం ఇండియన్ 2 తెలుగు ప్రమోషన్స్‌లో బాగంగా హైదరాబాద్‌లో ల్యాండైంది. ఓ వైపు లండన్ వీధుల్లో ఇండియన్ 2 స్పెషల్ టీ షర్ట్స్ వేసుకొని గ్రూప్ డ్యాన్స్‌లతో హోరెత్తి్స్తుండగా.. మరోవైపు కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ్ టీం హైదరాబాద్ ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది. ఈ విజువల్స్, స్టిల్స్ ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి శంకర్ లాంగ్ రన్‌టైం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. 180 నిమిషాలు (3 గంటలు) లెంగ్తీ రన్‌టైంతో ఉండబోతున్న ఈ సినిమా మరి ప్రేక్షకులను ఎంతసేపు సీట్లో కూర్చొబెడుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
Senapathy fever hits the streets of London! 🌍✨ Join the hype as the people unite in a spectacular flashmob for #Hindustani2 🇮🇳#KamalHaasan#Ulaganayagan#Indian2#Shankar
pic.twitter.com/1XPLfC7JHG— Nammavar (@nammavar11) July 7, 2024
Landed in hyderabad 😍❤️🔥💪#KamalHaasan#Ulaganayagan#Indian2@Bhavna__B#Siddharth pic.twitter.com/c55bsecL9x
— Nammavar (@nammavar11) July 7, 2024
All set for the event 💪🔥😍#KamalHaasan#Ulaganayagan #Indian2#Bharateeyudu2#Shankar pic.twitter.com/1fuPeD2OxQ
— Nammavar (@nammavar11) July 7, 2024
Namskaaram Hyderabad
Senapathy is here in The Charminar city#KamalHaasan#Ulaganayagan#Indian2#Siddharth@Bhavna__B lucky you ❤️pic.twitter.com/5D5zchsUGg
— Nammavar (@nammavar11) July 7, 2024
Devara | డబ్బింగ్ పనుల్లో తారక్ దేవర.. హిమజ క్లారిటీ
Saripodhaa Sanivaaram | నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య