Mrunal Thakur | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తోపాటు స్టార్ యాక్టర్లు మెరిసిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేశాడు.జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మూవీ లవర్స్‌తోపాటు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించిన మృణాళ్ ఠాకూర్ సినిమాపై తన స్పందనను షేర్ చేసుకుంది.
కల్కి 2898 ఏడీ విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. టీం అంతా అద్భుతంగా పనిచేశారు. నటీనటులు, సంగీతం, వీఎఫ్ఎక్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతీ ఒక్కటి అద్బుతంగా కుదిరాయి. నాగ్ అశ్విన్ ఈ మాస్టర్ పీస్‌ను అందించిన మీ విజన్‌కు ధన్యవాదాలు. అమితాబ్ బచ్చన్ సార్ మీనే నిజంగా షాహెన్షా. అశ్వత్థామగా మీ పాత్ర అసాధారణమైనది. మీరు ప్రతీ సన్నివేశంలో కమాండ్ చేసిన విధానం నన్ను ఇంకా అబ్బురపరుస్తూనే ఉంది. కమల్ హాసన్ సార్ మీ యాక్టింగ్ నమ్మశక్యం కాని విధంగా ఉంది. పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Devara | డబ్బింగ్ పనుల్లో తారక్ దేవర.. హిమజ క్లారిటీ
Saripodhaa Sanivaaram | నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య