Devara 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లైనప్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అవైటెడ్ సీక్వెల్ ‘దేవర 2’ కూడా ఉండటం అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ పార్ట్ 1 మంచి విజయం సాధించడంతో, రెండో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కొంతకాలంగా ‘దేవర 2’పై స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారి తీసింది. సీక్వెల్ ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. మధ్యలో కొన్ని రోజులు సీక్వెల్ లేదన్న టాక్ బలంగా వినిపించడంతో, అభిమానుల్లో నిరాశ కూడా వ్యక్తమైంది.
ఆ తర్వాత దాదాపుగా ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయిందనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ‘దేవర 2’ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ తాజాగా సిద్ధం చేసిన కొత్త వెర్షన్ ఎన్టీఆర్‌కు నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మారిన సమీకరణాలతో సీక్వెల్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి కథ, స్క్రిప్ట్ పరంగా మరింత బలమైన అవుట్‌పుట్‌తో ముందుకు వెళ్లాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నాడని, ఎన్టీఆర్ కూడా సంతృప్తిగా ఉన్నాడన్న రూమర్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. దీంతో ‘దేవర 2’ ఆగమనం దాదాపు ఖాయమన్నట్టే అనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అందువల్ల ‘దేవర 2’పై పూర్తి స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఈ సీక్వెల్ చుట్టూ ఆసక్తికరమైన చర్చ కొనసాగనుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు.