Vettaiyan | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి Vettaiyan. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తలైవా 170గా వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
వెట్టయాన్ డబ్బింగ్కార్యక్రమాల్లో ఉంది. ఫహద్ ఫాసిల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై బిగ్ బీ, రజినీకాంత్.. 33 ఏండ్ల తర్వాత కలిసి కనిపించనుండటంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Vettaiyanలో తలైవా పాత్ర కామెడీ టచ్‌తో సాగుతుందని టైటిల్ టీజర్‌తో హింట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు డైరెక్టర్. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. రజినీకాంత్ మరోవైపు తలైవా 171గా తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
Dubbing for Vettaiyan 🕶️ starts 🎙️ Peek into FaFa’s dubbing session. 🤩#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4 @ritika_offl @officialdushara @srkathiir @philoedit… pic.twitter.com/hWaztLTJuj
— Lyca Productions (@LycaProductions) July 7, 2024
Vettaiyan టైటిల్ టీజర్..
Devara | డబ్బింగ్ పనుల్లో తారక్ దేవర.. హిమజ క్లారిటీ
Saripodhaa Sanivaaram | నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య