Nayanthara | ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), తమిళ స్టార్ నటుడు ధనుష్ (Dhanush) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్ గతేడాదిన నవంబర్‌లో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై దావా వేశారు. అయితే, ధనుష్ దావాను నెట్‌ఫ్లిక్స్ సవాల్ చేసింది. ధనుష్ చేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా మద్రాసు హైకోర్టు (Madras High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
నయన్.. ధనుష్ మధ్య గతకొంత కాలంగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు.
ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో అందుకు నష్టపరిహారంగా 10కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ నయనతార టీమ్‌కు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. దాంతో మనసు నొచ్చుకున్న నయనతార.. ధనుష్‌కు భారీ లెటర్ని రాసింది. ఇందులో ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఆగ్రహించిన ధనుష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నయన్ దంపతులపై దావా వేశారు. ధనుష్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. విచారణకు అంగీకరించింది. ఈ క్రమంలోనే నయనతార దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ధనుష్ చేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
Also Read..
“Nayanthara | ధనుష్‌తో వివాదం.. నయనతారకు మద్రాసు హైకోర్టు నోటీసులు”
“Nayanthara | నేనెందుకు భయపడాలి..?.. ధనుష్‌తో వివాదంపై నయనతార కామెంట్స్”
“Nayanthara | వడ్డీతో సహా తిరిగొస్తుంది.. ధనుష్‌ను ఉద్దేశించి నయనతార పోస్ట్!”
“Nayanthara | ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.. ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార లాయర్”
“Dhanush | డాక్యుమెంటరీ వివాదంపై కోర్టును ఆశ్రయించిన ధనుష్.. నయన్ దంపతులపై దావా”