Fahadh Faasil |ఇటీవలే పుష్ప ది రూల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ స్టార్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నాడు. యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా కనిపించనుందని ఇన్సైడ్ టాక్.
కాగా లవ్‌స్టోరీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ పెట్టారట. బీటౌన్ సర్కిల్ టాక్ ప్రకారం ఈ మూవీకి ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్ (Idiots of Istanbul) టైటిల్ ఫైనల్ చేశారట. ఈ క్రేజీ టైటిల్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఫహద్ ఫాసిల్, ఇంతియాజ్ కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో క్యూరియాసిటీ రోజురోజుకీ పెరిగిపోతుంది.
ఇప్పటికే తృప్తి డిమ్రి, ఇంతియాజ్ అలీ కాంబోలో లైలా మజ్ను సినిమా వచ్చింది. మరి సిల్వర్ స్క్రీన్‌పై రెండోసారి సందడి చేయబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Game Changer | అందమైన లొకేషన్లలో రాంచరణ్, కియారా అద్వానీ.. నానా హైరానా సాంగ్ షూట్ సాగిందిలా..!
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్