గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 11, 2020 , 18:19:31

మిల్కీ బ్యూటీ తమన్నా స్వయంవరం ప్రకటిస్తే..

మిల్కీ బ్యూటీ తమన్నా స్వయంవరం ప్రకటిస్తే..

దక్షిణాది సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ బాహుబలి, సైరా వంటి భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో అందరినీ పలుకరించింది. ప్రస్తుతం ఇండస్ట్రీల్లో ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ లిస్టులో తమన్నా కూడా ఉందన్న విషయం తెలిసిందే. 

ఎప్పుడూ పెళ్లి ఊసేత్తని ఈ భామ తాజాగా ఇదే అంశంపై మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల తమన్నా మీడియాతో చేసిన చిట్‌టాట్‌లో తన స్వయంవరం అంశాన్ని ప్రస్తావించింది. ఒకవేళ తాను స్వయంవరం ప్రకటిస్తే ముందుగా వరుడి జాబితాలో హృతిక్‌రోషన్‌, విక్కీ కౌశల్‌, ప్రభాస్‌ లాంటి వ్యక్తుల పేర్లు ఉండాలని కోరుకుంటానని చెప్పింది. వరుస సినిమాలతో బిజీ ఉన్న తమన్నా హఠాత్తుగా ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. మరి ఈ మిల్కీ బ్యూటీ చేసిన వ్యాఖ్యలపై హృతిక్‌, విక్కీ కౌశల్‌, ప్రభాస్‌ ఏమైనా స్పందిస్తారో చూడాలి.  


logo