Allu Arjun | డబ్బు సంపాదించడమే సినిమా ఇండస్ట్రీలో ప్రధానమైంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కోట్లు సంపాదించడం కంటే విలువ నిలబెట్టుకోవడం అన్నింటికంటే ముఖ్యం అని కూడా కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని ప్రమాదకరమైన ఉత్పత్తులకు ప్రచారం చేస్తే.. తమను ఫాలో అయ్యే అభిమానుల ఆరోగ్యం దెబ్బ తింటుంది అని ఆలోచించే నటీనటులు కూడా ఉన్నారు. అలాంటి నటుల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు.
తాజాగా అల్లు అర్జున్ ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడానికి నో చెప్పాడు దానికి ప్రధానమైన కారణం పాన్ పరాక్ ఎన్ డోర్స్ కావడమే. తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈయన. దాంతో కార్పొరేట్ కంపెనీలు కూడా తమ బ్రాండ్ ప్రమోట్ చేయమని బన్నీ వెంట పడుతున్నాయి. సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గానూ చాలా బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా బ్రాండ్స్ కు ఎండోర్స్ చేస్తున్నారు.
తాజాగా ఈయనకు మరో కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది.. కానీ దానికి నో చెప్పారు అల్లు అర్జున్. దానికి కారణం అది టొబాకో సంబంధిత ఉత్పత్తి కావడమే. పాన్ పరాక్ యాడ్ బ్రాండింగ్ చేయమని బన్నీని కోరితే ఆయన తిరస్కరించారు. తాను అది ప్రమోట్ చేస్తే అభిమానులు కూడా అదే ఫాలో అవుతారనే కారణంతో దాన్ని తిరస్కరించారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అలాంటి బ్రాండింగ్ తాను చేయనని చెబుతున్నారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది.
“పుష్ప..పుష్పరాజ్ రాసేదే లే.. పదో తరగతి విద్యార్థి సమాధానం..టీచర్ షాక్!!”
“Allu Arjun Choreographers | టాప్ కొరియోగ్రఫర్లకు అల్లు అర్జున్ టార్గెట్ ఫిక్స్..!”
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..?”