సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. హీరో మేనరిజమ్స్‌ను అచ్చుగుద్దినట్లు అనుకరిస్తుంటారు. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ సినిమా పుష్పలో డైలాగ్స్‌ను పిల్లలందరూ ఇమిటేట్ చేసేస్తున్నారు. తగ్గేదే లే డైలాగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఏ పిల్లాడి నోట విన్నా అదే డైలాగ్ వినిపిస్తోంది. అయితే, పరీక్షలో ఓ పదో తరగతి విద్యార్థి ఆన్సర్ షీట్‌పై ఇలాంటి డైలాగ్ రాయగా, అది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పశ్చిమబెంగాల్లో పదో తరగతి విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు మార్చి 7 నుంచి మార్చి 16 వరకు జరిగాయి. కాగా, ఈ పరీక్షల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేస్తున్న టీచర్‌కు ఓ షాక్ తగిలింది. ఓ విద్యార్థి సమాధాన పత్రంపై తాటికాయంత అక్షరాలతో పుష్ప.. పుష్పరాజ్ అపున్ లికేంగా నహీ (పుష్ప..పుష్పరాజ్ రాసేదేలే) అని రాశాడు. ఈ సమాధాన ప్రతం చూసిన టీచర్ కంగుతిన్నాడు. దీన్ని సోషల్‌మీడియాలో పెట్టగా వైరల్‌గామారింది. దీనిపై నెటిజన్లు మీమ్స్ వేస్తూ ఎంజాయ్‌చేస్తున్నారు.