వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ భామ బాలీవుడ్ (Bollywood)లోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డది. ఈ భామ ఇటీవలే విడుదలైన అటాక్‌తో హిందీ ఆడియెన్స్ ను పలుకరించింది. ఈ బ్యూటీ నేడు ఇన్ స్టాగ్రామ్‌లో తన అభిమానులు, ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అయ్యింది.
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్‌ను తెలుగులో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని ప్రశ్నించాడు. దానికి అల్లు అర్జున్ (Allu Arjun) అని సమాధానమిచ్చింది రకుల్. గతేడాది వైష్ణవ్‌తేజ్-క్రిష్ కాంబినేషన్లో వచ్చిన కొండపొలం సినిమాలో మెరిసింది రకుల్. ప్రస్తుతం 31 October Ladies Night అనే తెలుగు సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుందీ సినిమా.
తమిళంలో అయలాన్ సినిమా చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, రన్ వే 34, మిషన్ సిండెరెల్లా సినిమాల్లో నటిస్తోంది.