పుష్ప..పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే బాలీవుడ్ (Bollywood)ను ఓ ఊపు ఊపేసింది. అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్పరాజ్ పాత్ర బాడీ లాంగ్వేజ్, సినిమాలో తగ్గేదే లే అంటూ వచ్చే డైలాగ్స్ సినిమా క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. పుష్పలో వచ్చే శ్రీవల్లి పాటలో బన్నీ వేసే హుక్ స్టెప్పులు ఓ రేంజ్ లో బాక్సాపీస్ ను షేక్ చేశాయి. పుష్ప సినిమాకు క్రేజ్ పెరుగడానికి ఒక రకంగా ఈ పాట కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో గమనిస్తే ఒక్క పాట కానీ, స్టెప్పుకానీ సినిమాకు విపరీతమై పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ లో వచ్చే నాటు నాటు సాంగ్ (Naatu Naatu step), బీస్ట్ సినిమాలో హలమితి హబిబో (Hallamithi Habibio) సాంగ్స్ కు వస్తున్న క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఈ పాటల్లో హైలెట్‌గా నిలుస్తున్న కామన్ థింగ్ డ్యాన్స్. ఈ రెండు పాటల్లో ఇరగదీసే స్టైలిష్ , మాస్ కొరియోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తున్నాయి. పుష్ప 2 కోసం రెడీ అవుతున్న అల్లు అర్జున్ ఇపుడు ఇదే విషయంపై ఫోకస్ పెట్టినట్టు ఓ వార్త ఫిలినగర్‌లో హల్ చల్ చేస్తోంది. పుష్ప 2 ప్రధానంగా డ్యాన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టడమే కాకుండా తన ఫేవరేట్ కొరియోగ్రఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ను అప్రోచ్ అయినట్టు టాక్.
పుష్ప 2 కోసం కొన్ని కొత్త స్టెప్పులను కంపోజ్ చేయాలని సూచనలు చేయడమే కాకుండా..రెగ్యులర్‌గా వారితో టచ్‌లో ఉంటూ ఎప్పటికపుడు కొత్త డ్యాన్స్ మూమెంట్స్ గురించి తెలుసుకుంటున్నాడట అల్లు అర్జున్. ఈ సారి కంపోజ్ చేసే డ్యాన్స్ దేశాన్ని షేక్ ఉండేలా చూసుకుంటున్నట్టు ఇన్‌సైడ్‌టాక్.