ICC World Cup 2023 | ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. ఒకే ఫ్రేమ్లో ఇద్దరూ స్టార్ హీరోలు
Salman Khan - Shivaraj Kumar | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఒకేచోట కలుసుకొని సందడి చేశారు.
Salman Khan – Shivaraj Kumar | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఒకేచోట కలుసుకొని సందడి చేశారు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3), డా. శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ఘోస్ట్ (Ghost). ఈ రెండు చిత్రాల ప్రమోషన్స్ కోసం సల్మాన్ ఖాన్, శివరాజ్ కుమార్ స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కలుసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరూ సూపర్ స్టార్స్ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక టైగర్ ప్రాంఛైజీలో సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో ఇప్పుడు టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది.
SALMAN KHAN – DR SHIVA RAJKUMAR – INDIA VS PAK MATCH… The two OGs – #SalmanKhan and Dr #ShivaRajkumar – meet at #INDvsPAK match.
Dr #ShivaRajkumar is in #Mumbai to promote his upcoming film #Ghost [in #Hindi], releasing on 19 Oct 2023. pic.twitter.com/icQT6W4Lqs
— taran adarsh (@taran_adarsh) October 14, 2023
ఇదిలా ఉండగా.. ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఘోస్ట్’(Ghost). ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయదశమి కానుకగా.. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రలు పొషిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్లో అలరించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

