Maruthi | అంకిత్ కొయ్య, నీలఖి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ బ్యూటీ (Beauty). జేఎస్ఎస్ వర్ధన్ మాటలందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ బ్యూటీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లతోపాటు టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. బ్యూటీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏర్పాటు చేశారు.
వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్‌గా హాజరైన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. మా ప్రతీ సినిమా ఆడిందంటే దానికి కారణం ఎస్కేఎన్ అన్నాడు. ఈరోజుల్లో సినిమాకు ఎస్కేఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ సపోర్ట్‌గా నిలిచారు. ఆ రోజులు వాళ్లిద్దరు లేకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నాడు. సుబ్బు మాకు ఎప్పుడూ క్రైం స్టోరీలు చెబుతుండేవారు. కానీ ఓ పాయింట్‌ను సుబ్బు చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది. కానీ మా గ్రూప్‌లో మాత్రం ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. ఆ తండ్రి ఇద్దరు పిల్లల తండ్రిగా ఈ విషయాన్ని పేపర్‌పై పెట్టారని నాకు అనిపించిందని చెప్పుకొచ్చాడు.
బ్యూటీ ప్రతీ ఒక్కరినీ సీటులో కూర్చోబెడుతుందన్నాడు డైరెక్టర్ జేఎస్ఎస్ వర్ధన్. నాకు రెండో అవకాశమిచ్చిన మారుతి నాకు డెమీ గాడ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని కథ విన్న వెంటనే నిమ్మకాయల ప్రసాద్ ముందుగా నమ్మారు. మా రైటర్స్, అంకిత్‌తో కలిసి ఐదు రోజులు పనిచేసి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్, కథను సిద్దం చేశాను. హీరో ఓ సినిమాను తన భుజానికి ఎత్తుకుని చేస్తే ఎలా ఉంటుందో.. బ్యూటీ అలా ఉంటుందని ఈ సినిమా కోసం అంకిత్ కొయ్య చాలా కష్టపడ్డాడని చెప్పాడు.
తెలుగు సినీ చరిత్రలో దాసరి టీం నుంచి ఎక్కువ మంది దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు మారుతీ టీం నుంచి ఎక్కువ మంది దర్శకులు వస్తున్నారు. ఆయన హిస్టరీలో నిలిచిపోతారు. భలే భలే మగాడివోయ్ సినిమాకు మారుతితో మొదటిసారి పనిచేశా. ఆ తర్వాత మళ్లీ నాకు కామెడీ సినిమాలు వచ్చాయి. కథ చెప్పినప్పుడే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఈ సినిమాలో నటించడం నాకు గర్వకారణమంటూ చెప్పుకొచ్చాడు సీనియర్ నటుడు వీకే నరేశ్.
Disha Patani | దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఇన్‌స్టాలో బాలీవుడ్ బ్యూటీ ఫస్ట్ పోస్ట్ ఇదే..!
Nani | నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఊహించని ట్విస్ట్.. మోహన్‌బాబు కీలక పాత్ర, చిరంజీవి క్యామియో?
SSMB29 New Schedule | రామోజీ ఫిల్మ్ సిటీలో SSMB29.. మొదలైన కొత్త షెడ్యూల్