Disha Patani | బాలీవుడ్ నటి దిశా పటాని వార్తల్లో నిలిచింది. దీనికి ప్రధాన కారణంగా కొత్త సినిమాలు కాదు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలోని ఆమె ఇంటిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఆమె కుటుంబంతో పాటు అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు దిశా పటాని స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇది కాస్త వైరల్‌గా మారింది. కాల్పుల ఘటన జరిగిన రెండురోజుల తర్వాత దిశా పటాని.. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేసింది. ఇంటర్నేషన్ బ్రాండ్ స్ప్రింగ్ కలెక్షన్ 2026 కోసం డిజైన్ వెరోనికా లియోన్ రూపొందించిన బ్లాక్ బ్యాక్‌లెస్ గౌనులో ఆమె చాలా స్టయిలిష్‌గా దిశ కనిపించింది.
కాల్పుల ఘటనతో కుటుంబం ఆందోళనకు గురైంది. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తండ్రి జగదీష్ పటాని స్పష్టం చేశారు. అయితే, ఆమె కుటుంబం ఇప్పటికీ కాల్పుల ఘటనతో భయపడుతున్నది. అభిమానులు దిశ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. చాలా మంది యూజర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారాను గుర్తు చేస్తున్నారు. బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న దిశా పటాని ఇంటి వెలుపల ఇద్దరు గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాదాపు ఎనిమిది నుంచి పది రౌండ్ల పాటు క్పాలులు జరిపారు. కాల్పుల శబ్దం చాలాదూరం వినిపించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దిశ తండ్రి జగదీష్ సైతం కాల్పులను ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు, ఎస్ఎస్పీ, ఏడీజీ స్థాయి అధికారులు స్వయంగా దర్యాప్తు చేస్తున్నారని జగదీష్ తెలిపారు.
గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా ఈ కాల్పులు తమ పనేనన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటూ సందేశాన్ని విడుదల చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. భవిష్యత్‌లో మతాన్ని, సాధువులను అవమానిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే, దీని వెనుక ఎవరున్నారో పోలీసులు ఇంకా స్పష్టం చేయలేకపోయారు. వాస్తవానికి దిష సోదరి ఖుష్బూ పటానీకి గతంలో ఓ వీడియోలో అనిరుద్ధాచార్య మహారాజ్ అనే ఆధ్యాత్మిక లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శించారు. కొందరు ట్రోలర్లు ఆ వీడియోతో ప్రీమానంద మహారాజ్‌పై ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేశారు. తాను అనిరుద్ధాచార్యపై మాత్రమే కామెంట్స్ చేశానని.. ప్రీమానంద్ మహారాజ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే దిష ఇంటి వద్ద కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్నారు.