Prashanth Varma | పాన్ ఇండియా స్థాయి సినిమాలు తెరకెక్కించే టాలెంట్ ఉన్న అతికొద్ది మంది టాలీవుడ్ యువ దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మూవీ సక్సెస్‌తో ప్రశాంత్ వర్మ టాప్ ప్రొడ్యూసర్ల ఫోకస్ తనవైపునకు తిప్పుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాలు వివాదాల చుట్టుముట్టినా.. ఈ క్రేజీ డైరెక్టర్ సినిమాను చూసే విధానం, తెరకెక్కించే విషయంలో మాత్రం చాలా క్లారిటీతో ఉంటాడు.
పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో తాను నిర్మాతలను సమయం అడిగే విషయం వాస్తవమని అన్నాడు ప్రశాంత్ వర్మ. గోవాలో జరిగిన IFFI ఈవెంట్లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విడుదల తేదీల విషయంలో నియంత్రణ ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు ప్రశాంత్ వర్మ. నిర్మాతలతో చేసుకున్న ఒప్పందంలో రిలీజ్ డేట్ల విషయంలో తుది నిర్ణయం తానే తీసుకుంటాననే నిబంధన ఉండేలా చూసుకుంటానని చెప్పాడు ప్రశాంత్ వర్మ.
అవుట్‌పుట్ బాగా రావాలంటే.. వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టుకు చాలా సమయం ఇవ్వాలని లేదంటే.. మీ (నిర్మాతలు)దగ్గర బాగా డబ్బు ఉంటే అవుట్‌పుట్ ఏదో ఒక పెద్ద కంపెనీకి ఇచ్చి వీఎఫ్ఎక్స్ పూర్తి చేయించాలని నేను తెలుసుకున్నా. నా తొలి సినిమా విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల.. నేను ఏదైనా సినిమాకు సంతకం చేసినప్పుడల్లా నా నిర్మాతలతో కలిసి నిర్ణయం తీసుకుంటా. విడుదల తేదీని నేనే నిర్ణయిస్తానని చెప్తానన్నాడు.
సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సరైన విధంగా అవుట్ పుట్ సిద్దం చేయడానికి సరైన సమయం ఇవ్వాలని అడుగుతా. నాకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆ టైం అవసరం అవుతుంది. అందువల్ల నిర్మాతలు కూడా నాకు టైం ఇచ్చే విషయంలో సంతోషంగా ఉంటారని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం