Pawan kalyan | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు హాజరుకాని వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆర్జీవీతోపాటు పలువురు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై ఇప్పుడే ఏం స్పందించనన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులను పని చేసుకోనివ్వండి. నా పని నేను చేస్తా. పోలీసుల సామర్థ్యంపై నేను స్పందించనని చెప్పారు.
హోంశాఖ, లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేవు. మీరు అడగాల్సింది ముఖ్యమంత్రిని. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా ఉండాలి. మీరు చెప్పిన విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసత్తా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకునేందుకు ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా నన్ను అడిగిందని సీఎం చంద్రబాబుకు చెబుతానన్నారు.
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా