తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సినీ నటుడు, జనసేన అధినేత పనవ్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను ఏపీ సీఎం జగన్ (YS Jagan MohanReddy) దృష్టికి తీసుకెళ్లాలని మోహన్ బాబును కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోపవన్ ప్రసంగంపై టాలీవుడ్ (Tollywood)నటుడు మోహన్ బాబు (Mohanbabu) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘చాలా కాలానికి ఈ అంశంలోకి నన్ను లాగావ్. సంతోషమే. ఇపుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు మంచు విష్ణు మా ఎన్నికల బరిలో నిలబడ్డ విషయం తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతీ మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈ లోపు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని, నీ సోదరుడి లాంటి విష్ణుబాబుకు, అతని టీంకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు’ అని ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు మోహన్ బాబు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
నా చిరకాల మిత్రుడి సోదరుడివైన నువ్వు నాకంటే చిన్నవాడివని ఏకవచనంతో సంబోధించానని ట్వీట్ లో పేర్కొన్నారు మోహన్ బాబు. పవన్ కల్యాణ్ ప్రసంగం నేపథ్యంలో మోహన్ బాబు చేసిన తాజా ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!