ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమాతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో నితిన్ (Nithiin). కామెడీ క్రైం థ్రిల్లర్ గా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు మేర్లపాక. అరకు సమీపంలోని ఓ గ్రామంలో అంధాధున్ సినిమా చూశాను. ఈ సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రాన్ని రీమేక్ చేయడమే సరైన అవకాశమనిపించింది. నితిన్ (Nithiin), సుధాకర్ రెడ్డి ఈ సినిమా రీమేక్ చేయాలని నన్ను సంప్రదించారు. ఒరిజినల్ వెర్షన్ లో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేశాం, వీటితోపాటు ప్రేమ కథలో కూడా మార్పులుంటాయి. రీమేక్ ను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేస్తే నాది కాపీ పేస్ట్ ఉద్యోగం అనుకుంటారు. అయితే సినిమా ఫీల్ మిస్సవకుండా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. నితిన్ అంధుడి పాత్రలో చాలా బాగా నటించాడు.
మొదటి షెడ్యూల్ లో కోవిడ్ ప్రభావంతో దుబాయ్ (Dubai) లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించామని మేర్లపాక గాంధీ అన్నారు. నితిన్ తొలి సన్నివేశం నుంచే అంధుడి పాత్రలో లీనమైపోయాడు. సినిమా తీసేందుకు నితిన్ కమిట్ మెంట్ చాలా సాయమైంది. టబు పాత్రలో తమన్నా నటించిన తీరును చూసి స్టన్ అయిపోయా. సీనియర్ యాక్టర్ నరేశ్, నభా నటేశ్ కూడా తమ తమ పాత్రలో జీవించేశారని చెప్పుకొచ్చాడు. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన అంధాధున్ లో రాధికా ఆప్టే, టబు ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!