Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిందని ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) డైరెక్ట్ చేస్తున్న సూర్య 44 (Suriya 44).
ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజు క్లారిటీ ఇచ్చేశాడు. సూర్య 44 గ్యాంగ్‌స్టర్ మూవీ కాదు.. ఇది చాలా యాక్షన్ పార్ట్‌తో కూడిన ప్రేమకథ. సూర్య అండ్ పూజా హెగ్డే లాంటి నటీనటులతో లవ్ స్టోరీ చేస్తున్నానని చాలా ఎక్జయిట్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానిక ఇసంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగళ్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అండమాన్ ఐలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీం.. పోర్ట్ బ్లెయిర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు సూర్య, పూజాహెగ్డేపై వచ్చే సాంగ్స్‌ను చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్.
🚨Karthik Subbaraj about #Suriya44😲🤩!!
” Atleast Suriya44 is not a Gangstar film. It’s a love story in core with lot of actions❤️🔥. I was so excited that I’m doing love story with Actors like #Suriya & Pooja Hegde❤️”#Kanguva pic.twitter.com/tZFn31MHBZ
— Sivadath V H (@SivadathH68311) November 14, 2024
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట