Ritu varma | హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో ముందుంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం స్వాగ్ (SWAG). హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దక్షా నగార్కర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. స్వాగ్‌లో రీతూవర్మ వింజామర వంశపు రాణి రుక్మిణి దేవి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రాజసం ఉట్టిపడే రాయల్ లుక్‌ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 4న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది స్వాగ్ టీం.
ఈ సినిమాతో రీతూవర్మ శ్రీవిష్ణుతో కలిసి పదకొండేళ్ల (ప్రేమ ఇష్క్ కాదల్) తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది. కాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రీతూవర్మ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం గతేడాది విడుదల కావాల్సింది. పదేండ్ల తర్వాత వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా కొంత ఆలస్యమవుతూ వచ్చింది. మేమిద్దరం (శ్రీవిష్ణు, రీతూవర్మ) చాలా సిగ్గపడే వ్యక్తులం. ఇద్దరి మధ్య ఉన్న కామన్ థింగ్ అదే. కానీ చాలా ఏండ్లుగా అతన్ని చూస్తున్నా. ఇండస్ట్రీలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సినిమాలో నా పాత్రకు బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన రాజమాత శివగామి పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పుకొచ్చింది రీతూ వర్మ.
ఆడ Ladies Vs మగ Gents.. అందరూ అక్టోబర్ 4న థియేటర్లకు వచ్చేయండి.. అంటూ ఇప్పటికే శ్రీవిష్ణు టీం రిలీజ్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ నేపథ్యానికి కామెడీ బ్యాక్‌డ్రాప్‌ను జోడిస్తూ.. వస్తోన్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వాగ్‌కు వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మేకర్స్ మరోవైపు ఇప్పటికే స్వాగ్ ప్రపంచానికి మరింత రాజసం.. అంటూ షేర్ చేసిన దక్షా నగార్కర్ లుక్ కూడా సోషల్ మీడియాలో రౌండప్ చేస్తోంది. ఇక బాబా సెహెగల్ పాడిన సింగరో సింగ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!