Deekshit Shetty | న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం దసరా (Dasara). పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. దసరా చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నాని తెరకెక్కించిన మీట్ క్యూట్ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దీక్షిత్ శెట్టి (Deekshit Shetty). ఈ యాక్టర్ దసరాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేశాడు. దీక్షిత్ శెట్టి దసరాలో నాని స్నేహితుడు సూరి పాత్రలో నటిస్తున్నాడు.
దసరాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేసిన దీక్షిత్ చిట్‌చాట్‌లో పలు విషయాలు పంచుకున్నాడు. దసరా రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. మంచి కంటెంట్‌తో కూడిన అన్ని ఎలిమెంట్స్ తో సాగే ఎంటర్టైనర్. ఈ పాన్ ఇండియా చిత్రంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నా. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం..నా పాత్ర కోసం భిన్నమైన బాడీ లాంగ్వేజీ బిల్డప్ చేసుకోవడం లాంటి చాలా విషయాలను నేర్చుకున్నానన్నాడు.
దసరా జర్నీ నాకు చాలా విషయాలు నేర్పించింది. నానిని నేచురల్ స్టార్ అని పిలవడానికి కారణం ఉంది. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన స్టార్. నాని నిర్ణీత సమయాని కంటే పది నిమిషాల ముందే సెట్‌కి వచ్చేవాడు. సినిమా ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేస్తాడు. శ్రీకాంత్ ఓదెల ఆయనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే దాకా రాజీపడడు. మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు దీక్షిత్ శెట్టి.
దసరాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Oscars 2023 | ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా..? అయితే ఈ ఛానళ్లలో ఆస్కార్స్ ఈవెంట్‌ను వీక్షించండి..!
Jr NTR | హాలీవుడ్ స్టార్‌తో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో స్టిల్
Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ సినిమాకు డిఫరెంట్ టైటిల్.. లుక్ వైరల్