Oscars 2023 | ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా..? అయితే ఈ ఛానళ్లలో ఆస్కార్స్ ఈవెంట్‌ను వీక్షించండి..!
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ వేడుకలకు అంతా సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అవార్డుల వేడుక ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
Oscars 2023 | మరికొన్ని గంటల్లో 95వ అకాడమీ అవార్డుల (95th Academy Awards) వేడుక జరుగనుంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ వేడుకలకు అంతా సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అవార్డుల వేడుక ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సారి భారత్ తరపున తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఫైనల్ నామినేషన్స్ లో నిలిచింది.
ఊరమాస్ బీట్తో నాటు నాటుగా ఆస్కార్ (Oscars 2023) స్టేజ్‌పై మరోసారి ఇరగదీసి.. ఆర్ఆర్ఆర్ విజేతగా నిలువడం ఖాయమని ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రతీ ఒక్కరూ విశ్వాసంతో ఉన్నారు. ఆస్కార్ వేడుకను చూద్దామనేవాళ్లు ఏఏ ప్లాట్‌ఫాంలలో చూడొచ్చనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆస్కార్ ఈవెంట్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ +హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిసిందే. మీకు ఒకవేళ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేకపోయినా.. లేదంటే స్ట్రీమింగ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈవెంట్‌ను మిస్సవుతామేమోనని దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆస్కార్ ఈవెంట్ టీవీలో కూడా వీక్షించవచ్చు.
ఓటీటీ అందుబాటులో లేనివాళ్లు స్టార్ కనెక్షన్ ఉంటే చాలు.. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ ప్రీమియర్ హెచ్డీ, స్టార్ వన్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ ఉత్సవ్, ఫాక్స్, ఫాక్స్ క్రైం, ఎఫ్, విజయ్ టీవీ ఛానళ్లలో కూడా ఆస్కార్ ఈవెంట్‌ను చూడొచ్చు. ఇంకేంటి మరి ఓటీటీ లేని వాళ్లు పై ఛానళ్లలో మీ స్టార్ నెట్‌వర్క్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఛానల్లో ఆస్కార్ ఈవెంట్‌ను వీక్షించొచ్చన్నమాట. రేపు ఉదయం 5:30 గంటల నుంచి ఈవెంట్ స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

