Kajal Aggarwal | టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ నటిస్తోన్న తమిళ చిత్రం ఘోస్టీ (Ghosty). కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఘోస్టీని 2023 మార్చి 17న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా తాజాగా మేకర్స్తెలుగు వెర్షన్ అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి తెలుగులో కోస్టి (Khosty) అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఈ మూవీని తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తోంది. తెలుగులో మార్చి 22న విడుదల కానుంది. ఈ క్రేజీ సినిమా ట్రైలర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, యోగి బాబు, కేఎస్ రవికుమార్, ఊర్వశి, మనోబాల, సంతాన భారతి, సత్యన్, స్వామినాథన్, జగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ డ్యుయల్ రోల్లో కనిపించనుంది.
హార్రర్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ మరోవైపు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2లో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో ఉమ ప్రాజెక్టులో నటిస్తోంది. తమిళంలో మరో సినిమాలో కూడా నటిస్తోంది.
తెలుగు వెర్షన్ కోస్టి లుక్..
Introducing @MsKajalAggarwal as #Ghosty
Get ready to witness Horror & Fun Loaded 😂 #Khosty in theatres from March 22nd!@Kalyaandirector @iYogiBabu @SamCSmusic @Sudhans2017 @Jayaram_gj @ksravikumardir @editorvijay @Jacobcamkid @thinkmusicindia @Gangaentertains #MaheshwarReddy pic.twitter.com/yD9QC3kEyc
— Ganga Entertainments (@Gangaentertains) March 11, 2023
తమిళ వెర్షన్ ఘోస్టీ లుక్..
Get ready for the endless comedy, roller coaster ride 🥳🥳#Ghosty releasing in theatres on March 17th.
Starring @iYogiBabu and me 👻
A @samcsmusic Musical
@Kalyaandirector @Sudhans2017 @Jayaram_gj @seedpictures1 @ksravikumardir @editorvijay @jacobcamkid @DoneChannel1 pic.twitter.com/JVEyDOXmMb— Kajal Aggarwal (@MsKajalAggarwal) March 5, 2023
Oscars 2023 | ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా..? అయితే ఈ ఛానళ్లలో ఆస్కార్స్ ఈవెంట్‌ను వీక్షించండి..!
Jr NTR | హాలీవుడ్ స్టార్‌తో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో స్టిల్