ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై (Mumbai) భామ అవికా గోర్ ( Avika Gor ). ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఈ బ్యూటీ నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతోంది. అవికాగోర్ నిర్మిస్తున్న తొలి చిత్రాన్ని అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ (Amazing experience) గా అభివర్ణించింది. ఈ మూవీ షూటింగ్ గోవాలో జరిపారు. తొలిసారి నిర్మాతగా మారిన అవికాగోర్ తన అనుభవాలను పంచుకుంది.
‘తొలిసారి సినిమా నిర్మిస్తుండటం అద్బుతమైన అనుభవం. 10 రోజులపాటు గోవాలో సినిమా చిత్రీకరించాం. అలలన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన వివరాలపై సస్పెన్స్ పెట్టింది అవికాగోర్. నిర్మాతగా ఉండటం నాకు ఓ నటిగా మరింత సహనాన్ని నేర్పించింది. అంతేకాదు వ్యక్తిగా ఎలా ఎదగాలో చెప్పేందుకు సాయపడింది. నా పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. సినిమా పూర్తయి ఎప్పడు విడుదలవుతుందా’ అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
అవికాగోర్ ఇటీవలే థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన నెట్ చిత్రంలో హాట్‌హాట్‌గా అందాలను ఆరబోసింది. నాగచైతన్యతో కలిసి థాంక్ యూ చిత్రంలో కూడా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Avika Gor : బ్లాక్ అండ్ బ్లాక్ లో చిన్నారి పెళ్లికూతురు
మాల్దీవుల్లో అవికాగోర్ అందాల కనువిందు..వీడియో హల్చల్
గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్
Avika Gor: పెళ్లికి ఇంకా టైముంది!
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్