పెళ్లికి ఇంకా టైముంది!

హైదరాబాదీ మోడల్ మిలింద్ చాంద్వానీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది అవికాగోర్. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఈ జంట ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవికా మాత్రం తమ పెళ్లికి ఇంకా సమయముందని అంటోంది. “ప్రస్తుతం నేను ప్రేమ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మిలింద్‌తో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నాం. భవిష్యత్తులో మా రిలేషన్‌షిప్‌ను తప్పకుండా పెళ్లిపీటలపైకి తీసుకెళ్తాం. అయితే అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదు. పెళ్లి తేదీ ఖరారు కాలేదు’ అని అవికా చెప్పింది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తన ఉన్నతిలో మిలింద్ భాగస్వామం చాలా ఉందని అవికా తెలిపింది. కష్టసమయాల్లో ప్రియుడు తన వెన్నంటి నిలిచాడని పేర్కొంది. “ఉయ్యాల జంపాల’ తర్వాత ఒకే తరహా పాత్రలు వరించడంతో చాలా సినిమాల్ని తిరస్కరించా. అదే సమయంలో బరువు పెరగడంతో నాలో అసంతృప్తి పెరిగింది. నేను సంతోషంగా లేనని గమనించిన మిలింద్ బరువు తగ్గేలా నాలో స్ఫూర్తిని నింపారు. చాలా సార్లు అతడిపై నేను కోపాన్ని ప్రదర్శించినా తాను మాత్రం సహనంతో నా తోడుగా నిలిచాడు. అతడు లేకపోతే నాలో పరివర్తన సులభమయ్యేది కాదు’ అని తెలిపింది. ప్రస్తుతం అవికాగోర్ తెలుగులో నాలుగు సినిమాలు చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

