Rukmini Vasanth | తెలుగులో సూపర్ ఫేం సంపాదించిన కన్నడ భామల్లో ఒకరు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). ఈ భామ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తనను యూత్ క్రష్ అని పిలుచుకోవడంపై ఈ భామ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘క్రష్’ అని పిలవడం చాలా ప్రశంసనీయమైన విషయం. కానీ నేను మాత్రం దాని గురించి పెద్దగా ఆలోచించనంది రుక్మిణి వసంత్.
‘నేను అలాంటి ప్రశంస తాత్కాలికమేనని నమ్ముతా.. అది కాలక్రమేణా మారుతూ ఉంటుంది. కానీ ఒక విషయంలో మాత్రం నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా మంది ఇప్పటికీ నన్ను ప్రియా అని పిలుస్తారు. సప్త సాగరదాచే ఎల్లో సినిమాలో నా పాత్ర పేరు అది. వాళ్లు (ప్రేక్షకులు) నా పాత్రను ఇష్టపడ్డారు. ప్రేక్షకులు నా పాత్రను ఎలా స్వీకరిస్తారో అని మొదట్లో భయపడ్డాను. ఇంత సరళమైన, సాధారణ పాత్రను వారు ఆరాధించడం చూడటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చింది’ రుక్మిణి వసంత్. సినిమాల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్లో తాను రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించాలని ఎదురుచూస్తున్నానంది.
రుక్మిణి వసంత్ ఖాతాలో ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. వీటిలో ఒకటి కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తోన్న టాక్సిక్ కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సినిమాలే కావడంతో అంచనాలు భారీగా ఉండటమే కాదు.. రుక్మిణి వసంత్ కెరీర్ను కూడా మలుపు తిప్పే సినిమాలు అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!