Sivakarthikeyan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ SK21. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం అమరన్ (Amaran) టైటిల్‌తో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.
అమరన్ అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్లో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. తాను అమరన్ కథ విన్న తర్వాత నిద్రపోలేకపోయానని.. అప్పుడే భారతీయ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ కథను అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటిస్తున్నాడు. సరిహద్దులో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయి అశోక చక్ర అవార్డు పొందారు మేజర్ ముకుంద్ వరదరాజన్.
ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ప్రమోషన్స్‌లో సాయిపల్లవి సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. నిర్మాత కమల్ హాసన్ కూడా మూవీ లవర్స్‌తో చిట్ చాట్ చేశాడు. ఇప్పటికే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమర జవాన్ల సేవలను స్మరించుకుంటూ అమరన్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు మేకర్స్.
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్