Pushpa movie first day collections | నిజానికి రెండు వారాల కింద తెలుగు ఇండస్ట్రీలో పండగ వాతావరణం మళ్లీ మొదలైంది. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో అల్లు అర్జున్ సినిమాకు అసలైన సెటప్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆకాశమే హద్దుగా పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.
అన్నింటికీ మించి అల్లు అర్జున్ గెటప్ కూడా పుష్ప సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ఇవన్నీ ఓపెనింగ్స్ విషయంలో బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇవ్వడం.. టికెట్ రేట్లు పెంచుకోమని ప్రభుత్వం చెప్పడం.. ఇవన్నీ నైజాంలో కలెక్షన్ల విషయంలో అనుకూలించాయి. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం ఈరోజు కచ్చితంగా 35 నుంచి 40 కోట్ల మధ్య షేర్ పుష్ప తీసుకురావడం ఖాయం అయిపోయింది. సినిమాకు అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా కూడా అల్లు అర్జున్ యాక్టింగ్ అదుర్స్ అని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతుండటంతో.. ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అఖండ విషయంలో కూడా కథ లేదు అని చెప్పినా కూడా కేవలం బాలకృష్ణ కోసం ఆ సినిమా చూశారు ప్రేక్షకులు. ఇప్పుడు పుష్ప విషయంలో ఇదే జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !
Pushpa: బెనిఫిట్ షో వేయలేదని థియేటర్‌పై దాడి చేసిన బన్నీ అభిమానులు