‘జీవో 134ను వెంటనే రద్దు చేయాలి’
రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిషేదిత జాబితాలో చేర్చిన భూమి సమస్యల పరిష్కారం కోసం విడుదల చేసిన జీవో 134 ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించడానికి తెచ్చిన జీవోలాగ ఉందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు...
తుంగతుర్తి, సెప్టెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిషేదిత జాబితాలో చేర్చిన భూమి సమస్యల పరిష్కారం కోసం విడుదల చేసిన జీవో 134 ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించడానికి తెచ్చిన జీవోలాగ ఉందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల, ప్రభుత్వం మీద పోరాడుతున్నారనే కక్ష సాధింపుతో ఈ జీవోను తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలాన్నింటిని గమనిస్తున్నప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠo చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

