L2 Empuraan | మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ (Mohanlal) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం L2 Empuraan. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంజు వారియర్, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు లోను చేస్తోంది.
ఈ చిత్రంలో గేమ్ ఆఫ్ థ్రోన్ యాక్టర్ Jerome Flynn కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో బోరిస్ ఒలివర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. తాజా అప్డేట్ నేపథ్యంలో మోహన్ లాల్ సినిమాపై క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్, సనియా అయ్యప్పన్, సాయికుమార్, బజ్జు సంతోష్, ఫజిల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలకు ముందే ఆరు దేశాలు, 25 పట్టణాల్లో చిత్రీకరించబడిన తొలి మలయాళ సినిమాగా నిలిచి.. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది.
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Toxic The Movie | ఒకేసారి రెండు భాషల్లో.. తొలి భారతీయ సినిమాగా యశ్ టాక్సిక్ అరుదైన ఫీట్..!