సూపర్ హిట్ మలయాళం ప్రాంఛైజీ ప్రాజెక్టు దృశ్యం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా హిందీలో దృశ్యం 2 (Drishyam 2) వస్తోన్న సంగతి తెలిసిందే. అజయ్ దేవ్ గన్, శ్రియా శరణ్ కాంబినేషన్లో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్టు దృశ్యం 2పై ఓ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు దృశ్యం 2 రన్ టైం 2 గంటల 22 నిమిషాలని బీటౌన్ సర్కిల్ తాజా టాక్. అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) దర్శకత్వం వహిస్తున్న దృశ్యం 2 నవంబర్ 18 థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, పనోరమ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. వెంకటేశ్, మీనా కాంబోలో ఇప్పటికే తెలుగులో రిలీజైన దృశ్యం 2కు మంచి టాక్ తెచ్చుకుంది.
దృశ్యం 2 ట్రైలర్ ..
Read Also : Anusha Shetty | నాగశౌర్య ఫియాన్సీ అనూషశెట్టి బ్యాక్గ్రౌండ్ వివరాలివే..!
Read Also : Sid Sriram | హిట్ 2లో సిద్ శ్రీరామ్ ఉరికెఉరికె పాట షురూ అయిందిలా.. వీడియో వైరల్
Read Also : Telugu Film Producers Council | సంక్రాంతి సినిమాల రిలీజ్పై టీఎఫ్పీసీ ప్రెస్ నోట్.. వివరాలివే