Bangarraju movie Two days collections | ఓవైపు బయట కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న కూడా బంగార్రాజు కలెక్షన్స్ తగ్గడం లేదు. అసలు ఈ సినిమాపై వైరస్ ప్రభావం ఇంత కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణలో కుటుంబాలు థియేటర్ వైపు కదులుతున్నాయి. దాంతో బంగార్రాజు కలెక్షన్ల పంట పండిస్తున్నాడు. మొదటి రోజు 9.3 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు అంత కంటే ఎక్కువ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సహా ఓవర్సీస్, కర్ణాటకలో కూడా మంచి వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.19 కోట్ల షేర్ వసూలు చేసింది బంగార్రాజు. అందులో రూ.36 కోట్ల గ్రాస్ ఉంది. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. అందుకే కలెక్షన్ల ప్రభంజనం కురుస్తుంది. రూ.39 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా.. 50 శాతం రికవరీ కేవలం రెండు రోజుల్లోనే సాధించింది. మూడో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో మరో 10 కోట్లు కచ్చితంగా వసూలు చేయడం ఖాయం. మరి రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం..
నైజాం: 4.47 కోట్లు
సీడెడ్: 3.46 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.20 కోట్లు
ఈస్ట్: 1.75 కోట్లు
వెస్ట్: 1.38 కోట్లు
గుంటూరు: 1.78 కోట్లు
కృష్ణా: 0.96 కోట్లు
నెల్లూరు: 0.85 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 16.85 కోట్లు
ఓవర్సీస్: 0.95 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 1.05 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్: 18.85 కోట్లు షేర్
రెండు రోజుల్లోనే బంగార్రాజు సినిమా సుమారు 19 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం ఖాయం. నాగార్జున మార్కెట్ కంటే ఎక్కువగా ఈ సినిమా కలెక్షన్స్ వస్తున్నాయి. దానికి కారణం సంక్రాంతి సీజన్. అందుకే వైరస్ ఉన్నా కూడా తన సినిమాను ధైర్యంగా విడుదల చేశాడు నాగార్జున. దానికి ఇప్పుడు ఫలితం అందుకుంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మలయాళ నటి.. అసలు నిజం ఇది..
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
మెగా అభిమానులకు గుడ్న్యూస్.. ‘ఆచార్య’ విడుదల తేదీ ప్రకటన..
భీమ్లా నాయక్ రిలీజ్పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్