raja vikramarka movie collections | ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి తారాజువ్వలా దూసుకొచ్చిన హీరో కార్తికేయ. ఆ సినిమా సాధించిన సంచలన విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు ఈ హీరో. అయితే ఆ తర్వాత మాత్రం మళ్లీ ఆ స్థాయి విజయం కాదు కదా.. కనీసం మరో విజయం కూడా అందుకోలేకపోయాడు. గుణ 369, హిప్పీ, చావు కబురు చల్లగా లాంటి సినిమాలు వచ్చినా కూడా కార్తికేయ ఆశలను.. ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టలేక నిరాశ పరిచాయి. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన ఈ సమయంలో కార్తికేయ నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క విడుదలైంది. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి కూడా యావరేజ్ టాక్ వచ్చింది. చిరంజీవి టైటిల్‌తో రావడంతో ముందు నుంచి కూడా దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. కొత్త దర్శకుడు.. వినాయక్ దగ్గర శిష్యుడిగా పని చేసిన శ్రీ సిరిపల్లి ఈ సినిమాను తెరకెక్కించాడు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. తమిళ సీనియర్ నటుడు పశుపతి ఇందులో విలన్‌గా నటించాడు. కార్తికేయ గత సినిమా చావు కబురు చల్లగా కంటే తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. మంచి ప్రమోషన్స్ కూడా రాజా విక్రమార్కకు వర్కవుట్ కాలేదు. మరి రాజా విక్రమార్క చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎంత వచ్చాయో చూద్దాం..
నైజాం: 0.19 కోట్లు
సీడెడ్: 0.06 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.09 కోట్లు
ఈస్ట్: 0.06 కోట్లు
వెస్ట్: 0.05 కోట్లు
గుంటూరు: 0.06 కోట్లు
కృష్ణా: 0.07 కోట్లు
నెల్లూరు: 0.04 కోట్లు
ఏపీ + తెలంగాణ: 0.62 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.09 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 0.71 కోట్లు షేర్
రాజా విక్రమార్క సినిమాకు రూ.4.3 కోట్ల థియెట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వడానికి 4.5 కోట్లు షేర్ రావాలి. తొలిరోజు కేవలం 71 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. డీసెంట్ ఓపెనింగ్స్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇది సరిపోదు. టాక్ సోసోగానే ఉండటంతో ఎంతవరకు బయటపడుతుందనేది కూడా ఆసక్తికరమే. మరి చూడాలిక.. ఈ టాక్‌తో రాజా విక్రమార్క బాక్సాఫీస్ దగ్గర ఏం చేయబోతుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kartikeya |ఆమెతో 11 ఏళ్ల ప్రేమ .. లవ్ స్టోరీలో విలన్ల గురించి బయటపెట్టిన కార్తికేయ
అజిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తికేయ..