By Maduri Mattaiah
karthikeya love story | ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువత హృదయాలకు దగ్గరైన కథానాయకుడు కార్తీకేయ. ఈ యువ కథానాయకుడు నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క. శ్రీ సరిపల్లి దర్శకుడు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా ఈ యువ కథానాయకుడు త్వరలోనే తను 11 సంవత్సరాలుగా ప్రేమించిన లోహితను పెండ్లి చేసుకొని ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు. ఈ సందర్భంగా కార్తికేయతో నమస్తే తెలంగాణ.కమ్ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది.
హాయ్ కార్తికేయ!
హాయ్..
పెండ్లి, సినిమా విడుదల రెండూ ఒకేసారి పెట్టుకున్నారు? ఏమైనా టెన్షన్‌గా ఫీలవుతున్నారా?
ఒత్తిడితో పాటు ఎదో తెలియని ఆత్రుత వుంది. అయితే రెండూ పాజిటివ్ విషయాలే కాబట్టి ఎంత ఒత్తిడి వున్నా ఈ ఆనందక్షణాలను ఎంజాయ్ చేస్తున్నాను.
రెండింటిలో ఏది ఎక్కువ మిమ్ములను టెన్షన్ పెడుతుంది?
నా దృష్టిలో ఇది ఒత్తిడి కాదు.. ఇదొ గొప్ప అనుభూతి.. పెండ్లి తరువాత జీవితం ఎలా వుండబోతుంది.? సినిమా ఫలితం ఎలా వుంటుంది..అనే ఉత్సుకతతో వున్నాను. రెండూ పోల్చలేని వైవిధ్యమైన ఫీలింగ్స్..
బ్యాచ్‌లర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు? బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎలా ఎంజాయ్చేశారు? మిగిలి వున్న బ్యాచ్‌లర్ డేస్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నారు?
ఎంజాయ్‌మెంట్‌కు టైమ్ లేదు.. గత ఐదు సంవత్సరాలుగా కెరీర్‌పైనే దృష్టిపెట్టాను..ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌లో వున్నాను..
మీ ప్రేమ, పెళ్లి గురించి ఇంతకు ముందు ఎప్పుడూ వార్తలు రాలేదు ఎందుకని?
నేను లోహితను 11 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. 2010లో బీటెక్ చేస్తున్నప్పుడు వరంగల్ నీట్లో పరిచయం.. 2012లో ప్రపోజ్ చేశాను. సంవత్సరం తరువాత ఒప్పుకుంది. నా ప్రేమ గురించి ఎవరికి చెప్పలేదు. సినీ పరిశ్రమలో కూడా ఎవరికి తెలియదు. అందుకే మా విషయం ఎవరికి తెలియదు.
మీ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు ఎప్పుడు చెప్పారు?వారిని ఎలా ఒప్పించారు?
మా ప్రేమ విషయం మూడు నెలల క్రితమే కుటుంబసభ్యులకు తెలిసింది. లోహితను ప్రేమిస్తున్న విషయం తొలుత మా ఇంట్లో వారికి చెప్పా. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులను ఒప్పించాం. మా మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి చాలా కాలంగా అందరికి తెలియడం వల్ల ఎవరూ అడ్డు చెప్పలేదు. బీటెక్ చదువుతున్న రోజుల్లో లోహిత నాకు పంపించిన ఓ మెసేజ్ కారణంగా మా ఇంట్లో గొడవ జరిగింది. ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ రోజు నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఇటీవల మా ఇంట్లో వాళ్లకు తెలిసింది. మా మధ్య సఖ్యత, అనుబంధాన్ని కుటుంబసభ్యులు అర్థంచేసుకొని పెళ్లికి అంగీకరించారు.
అంటే మీ రియల్ ప్రేమకథలో విలనిజాలు, ట్విస్ట్‌లు ఏమీ లేవా?
అలాంటివేమీ లేవు. ఎందుకంటే ప్రాసెస్ అంతా చాలా స్మూత్‌గా జరిగిపోయింది. నేను హీరో అయిన తరువాతే ప్రేమ గురించి చెబుదామనుకున్నాను.. చెప్పగానే అందరూ ఒప్పుకున్నారు..
లైఫ్‌లో సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకుంటున్నారని అనుకోవచ్చా?
జీవితంలో పూర్తిగా స్థిరపడిన ఫీలింగ్ లేదు కాని.. నా ప్రేమను వ్యక్తపరిచి, పెద్దవాళ్లను ఒప్పించగలిగే స్థానంలో వున్నానని అనుకున్నాను.. అందుకే పెద్దవాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాను.
రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుకలో అలా స్టేజీ మీద లోహితకు ప్రపోజ్ చేశారు ఎందుకని?
పెండ్లి తరువాత ఆ అవకాశం వుండదు కాబట్టి.. లైఫ్‌లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా వుండాలని.. మెమరబుల్‌గా ఓ మూమెంట్‌ను క్రియేట్ చేయాలని అలా సర్ప్రైజ్ చేశాను.. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిని చేసుకోవడం అదృష్టంగా ఫీలవుతున్నాను..
లోహితకు మీరు నటించిన సినిమాల్లో ఏది ఇష్టం?
ఆర్ఎక్స్100 సినిమాను తాను ఇంకా చూడలేదు. ఆ సినిమా విడుదలకు ముందు మేమిద్దరం గొడవ పడ్డాం. కొద్ది రోజులు మాట్లాడుకోలేదు. అందుకే తను ఆ సినిమా చూడలేకపోయింది. మళ్లీ కలుసుకున్న తర్వాత చూస్తానంటే నేనే వద్దన్నాను. ఎప్పుడైనా తాను సినిమా చూస్తానని అంటే సెకండాఫ్ నుంచి చూడమని చెబుతా.
మీ కెరీర్లో రాజా విక్రమార్క స్పెషాలిటీ ఏమిటి?
రాజా విక్రమార్క ఇప్పటి వరకు చేసిన సినిమాలకు డిఫరెంట్‌గా వుండే సినిమా ఇది. అన్ని సహజంగా కుదిరాయి. అన్ని ఎలిమెంట్ప్ కథలో భాగంగానే వస్తాయి. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాం.
మీ పరాజయాలను విశ్లేషించుకుంటారా?
నా కెరీర్ ప్లానింగ్ అంతా నాదే..పరాజయాలతో గుణపాఠాలు నేర్చుకున్నాను. ముందు సినిమాకు చేసిన తప్పులు చేయకూడదు అనేది చూసుకుంటాను.
తమిళ్ హీరో అజిత్ సినిమాలో విలన్ గా చేస్తున్నారని తెలిసింది?
ఒక హీరో చేయాలిసిన హీరో విలన్ రోల్ అది. చాలా డిఫరెంట్‌గా వుంటుంది. తమిళంలో నా మొదటి సినిమా అంత గొప్ప స్టార్‌తో చేయడం గర్వంగా వుంది
interview by; MADURI MATTAIAH
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Karthikeya: కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. అందరి ముందు ప్రపోజ్ చేసి షాకిచ్చాడు..!
karthikeya love story కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
అజిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కార్తికేయ..
Karthikeya | కార్తికేయకు కాబోయే భార్య ఆర్ఎక్స్100 సినిమా ఎందుకు చూడలేదో తెలుసా?