Satyadev | రాజకీయాలు, రౌడీయిజం ఉండవంటున్న సత్యదేవ్
‘కెరీర్ ఆరంభం నుంచి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా. రాబోవు చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ప్రతీ సినిమాకు పాత్రలపరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నా’ అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు.
Satyadev | ‘కెరీర్ ఆరంభం నుంచి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా. రాబోవు చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ప్రతీ సినిమాకు పాత్రలపరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నా’ అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘విజయవాడ నేపథ్యంలో ముగ్గురు మిత్రుల కథ ఇది.
వారి స్నేహం, జీవితాల చుట్టూ నడుస్తుంది. కుటుంబాలను గొప్ప స్థాయిలో చూసుకోవాలని కలలు కన్న వారికి కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారు చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. విజయవాడ అంటే పాలిటిక్స్ అనుకుంటారు. కానీ ఇందులో రాజకీయాలు, రౌడీయిజం వంటి అంశాలుండవు. కథలో సహజత్వం కనిపించాలని విజయవాడలో అరవై రోజుల పాటు చిత్రీకరణ చేశాం’ అన్నారు. ఈ సినిమాలో తాను వించిపేటకు చెందిన భద్ర అనే యువకుడి పాత్రలో కనిపిస్తానని, ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని సత్యదేవ్ తెలిపారు. నాయగన్, ఆపద్భాందవుడు వంటి సినిమాలు చేయాలన్నది తన డ్రీమ్ అని, భవిష్యత్తులో ఆ తరహా క్యారెర్టక్స్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

