Akhanda fifth week collections | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా వచ్చి అప్పుడే 5 వారాలు పూర్తయిపోయింది. ఐదో వారంలో కూడా అక్కడక్కడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది ఈ సినిమా. రెండో వారం తర్వాత పుష్ప వచ్చినా.. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఐదో వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది అఖండ. బాలయ్య బాక్సాఫీస్ దగ్గర చాలా రోజుల తర్వాత సత్తా చూపిస్తున్నాడు. ఐదో వీకెండ్ దాదాపు రూ.1.30 కోట్ల వరకు వసూలు చేసింది అఖండ. అలాగే 35 రోజులు పూర్తైపోయిన తర్వాత ఎంత వచ్చింది.. ఇంకా ఎంత రావాలి అనే లెక్కలు బయటికి వచ్చాయి. డిసెంబర్ 17న పుష్ప వచ్చాక కూడా వీకెండ్ సత్తా చూపించాడు అఖండ. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు అఖండ. ఓసారి 5 వీక్స్ కలెక్షన్స్ చూద్దాం..
ఏరియా | వచ్చింది | అమ్మింది |
నైజాం | 20.50 కోట్లు | 10.5 కోట్లు |
సీడెడ్ | 15.50 కోట్లు | 10.6 కోట్లు |
ఉత్తరాంధ్ర | 6.22 కోట్లు | 6 కోట్లు |
ఈస్ట్ | 4.18 కోట్లు | 4.00 కోట్లు |
వెస్ట్ | 3.96 కోట్లు | 3.5 కోట్లు |
గుంటూరు | 4.78 కోట్లు | 5.4 కోట్లు |
కృష్ణా | 3.60 కోట్లు | 3.7 కోట్లు |
నెల్లూరు | 2.63 కోట్లు | 1.8 కోట్లు |
ఏపీ-తెలంగాణ టోటల్ | 61.30 కోట్లు | 45.50 |
ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక | 10.67 కోట్లు | 7.5 కోట్లు |
టోటల్ వరల్డ్ వైడ్ 25 డేస్ కలెక్షన్స్ | 72.07 కోట్లు షేర్ | 53 కోట్లు |
అఖండ సినిమా ఇంత ప్రభంజనం సృష్టించినా కూడా గుంటూరు, కృష్ణా ఏరియాల్లో మాత్రం ఇంకా సేఫ్ కాలేదు. గుంటూరులో ఈ సినిమాను 5.40 కోట్లకు అమ్మితే.. ఇప్పటి వరకు కేవలం 4.78 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 60 లక్షల వరకు అక్కడ బాకీ ఉంది. మరోవైపు కృష్ణాలో కూడా 3.70 కోట్లకు సినిమాను అమ్మితే 3.60 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే మరో 10 లక్షలు వెనకబడి ఉందన్నమాట. ఫుల్ రన్ అయ్యేసరికి అక్కడ కూడా లాభాల్లోకి వస్తుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్ప క్లోజింగ్ కలెక్షన్స్.. కెరీర్లో రెండోసారి 150 కోట్లు దాటిన బన్నీ..
శ్యామ్ సింగరాయ్ 13 డేస్ కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..
Akhanda | అఖండ 5 వీక్స్ కలెక్షన్స్.. బాలయ్య మామూలోడు కాదు..
శృతి హాసన్ జోరు.. బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో ఆఫర్..