Pushpa movie final collections | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఊహించినట్లుగానే మొదటి రోజు నుంచే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. అయితే వారం రోజుల తర్వాత పుష్ప దూకుడు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సత్తా చూపించాడు అల్లు అర్జున్. ముఖ్యంగా హిందీ, తమిళంలో అయితే ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. అక్కడ ఎవరూ ఊహించని రేంజ్లో రెచ్చిపోయాడు పుష్ప. హిందీలో బాహుబలి, సాహో తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. రూ.65 కోట్ల నెట్ వసూలు చేసింది ఈ చిత్రం. తమిళంలో రూ.25 కోట్లు.. కేరళలో రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో పుష్ప జనవరి 7న విడుదల కానుంది. మరి ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
నైజాం: 36.68 కోట్లు
సీడెడ్: 14.20 కోట్లు
ఉత్తరాంధ్ర: 7.88 కోట్లు
ఈస్ట్: 4.87 కోట్లు
వెస్ట్: 4.08 కోట్లు
గుంటూరు: 5.29 కోట్లు
కృష్ణా: 4.17 కోట్లు
నెల్లూరు: 3.08 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 80.25 కోట్లు
తమిళనాడు: 10.30 కోట్లు
కర్ణాటక: 10.40 కోట్లు
కేరళ: 5.05 కోట్లు
ఓవర్సీస్: 12.75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 31.50 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 150.25 కోట్లు షేర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శ్యామ్ సింగరాయ్ 13 డేస్ కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..
Akhanda | అఖండ 5 వీక్స్ కలెక్షన్స్.. బాలయ్య మామూలోడు కాదు..
శృతి హాసన్ జోరు.. బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో ఆఫర్..
పుష్ప 2 విషయంలో సుకుమార్‌కు డెడ్‌లైన్ పెట్టిన అల్లు అర్జున్..
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
అప్పుడూ.. ఇప్పుడూ కరోనా నుంచి తప్పించుకున్న అదృష్టవంతులు వీళ్లే..