Honeymoon Express | కుమారి 21ఎఫ్ సినిమాతో ఎంట్రీలోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ముంబై భామ హెబ్బా పటేల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ చైతన్యరావుతో కలిసి నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express). బాల రాజశేఖరుని రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 21న థియేటర్లలో విడుదల కాగా.. మిశ్రమ స్పందన రాబట్టుకుంది.
ఇక రెండు నెలల తర్వాత ఆగస్టు 27న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ, పెండ్లి, విడాకుల కాన్సెప్ట్‌తో యూత్‌ను ఆకట్టుకుంటూ ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్‌లో 40 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో అందరి అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకుంటోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటించగా.. అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ ఇతర కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రాన్ని ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యూఎస్ఏ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కించగా.. కళ్యాణిమాలిక్ సంగీతం అందించారు.
40 Million+ Minutes Watched!
Thank you for making #HoneyMoonExpress a hit with 40 MILLION+ streaming minutes on Amazon Prime Video! 🙌 Haven’t seen it yet? Stream now! 🎬https://t.co/scmaIjfHaV@IamChaitanyarao @ihebahp @TanikellaBharni@hasinimani @BRajasekharuni…
— Friday Matinee (@VRFridayMatinee) September 15, 2024
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది