టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న పాన్ ఇండియా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ, శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)ను ముందుగా ఫైనల్ చేయగా..మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో మేకర్స్ ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
జాక్వెలిన్ స్థానంలో మరో కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక చేసే అవకాశాలున్నట్టు అప్ డేట్స్ కూడా వచ్చాయి. అనుకున్నట్టుగానే నోరా ఫతేహి ఈ సినిమాలో నటించేందుకు సైన్ చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. అంతేకాదు త్వరలోనే సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట ఈ డ్యాన్సింగ్ క్వీన్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తుండగా..ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా లైన్లో పెట్టాడు పవన్‌కల్యాణ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’