Hanuman Movie | బుక్ మై షో లో ‘హనుమాన్’ రికార్డు.. రెండు రోజుల్లో 10 లక్షల టికెట్లు బుకింగ్స్
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏ ఇద్దరు మూవీ లవర్స్ మాట్లాడుకున్న హనుమాన్ చూసావా అని మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది.
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏ ఇద్దరు మూవీ లవర్స్ మాట్లాడుకున్న హనుమాన్ చూసావా అని మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుందని, వీఎఫ్ఎక్స్, విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవలం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రం విడుదలకు ముందే ఇండియా వైడ్‌గా మంచి హైప్‌ను అందుకుంది.
Massive feat achieved by #HANUMAN on @bookmyshow 💥
𝟏𝟎,𝟎𝟎,𝟎𝟎𝟎 Tickets Sold in just 2 Days as everyone witnessed #HanuManRAMpage to the heights 🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha… pic.twitter.com/IKCszeRrrC— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 14, 2024
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అంజనాద్రి అనే ఊహ ప్రాంతం. ఆ వూర్లో హనుమంతు (తేజాసజ్జా) ఒక మామూలు కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు. అనుకోని సంఘటనతో హనుమంతుకి కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తుల గురించి తెలుసుకున్న మైఖెల్ (వినయ్‌రాయ్) అంజనాద్రి వస్తాడు. హనుమంతు వద్ద శక్తులని తన వశం చేసుకొని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు కావాలనుకుంటాడు. మరా ఆ శక్తిని వశం చేసుకోవడానికి మైఖెల్ ఏం చేశాడు? మైఖేల్ వలన అంజనాద్రికి ఎలాంటి ముప్పు వాటిల్లింది ? హనుమంతు మైఖేల్ ని ఎలా అడ్డురుకున్నాడు ? అనేది తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

