Double iSmart | టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) ఒకటి. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుండగా.. ఈ ఇద్దరి కలయిలకలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడని.. ఈ సీన్ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని టాక్. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
మే 15న రామ్ పోతినేని బర్త్‌డే ఉండగా.. ఆ రోజు ఫస్ట్ సింగిల్ మాకి కిరికిరి (Maaki kirikiri) అనే సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ సీక్వెల్‌కు అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.