Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నంద్యాల పోలీసులు షాకిచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్‌తో పాటు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే జనసమీకరణ చేశారని నంద్యాల పోలీసులకు స్థానిక ఆర్వో ఫిర్యాదు చేశారు. దీంతో బన్నీపై ఐపీసీ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. . దీనికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీ కాబట్టి పవన్ కల్యాణ్‌కే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అందరి ఊహలకు తగ్గట్టుగానే పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తూ కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. కానీ తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా ఆయన ఆయన సతీమణి స్నేహారెడ్డితో కలిసి స్వయంగా నంద్యాలకు వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ దంపతులకు శిల్పా రవి ఘన స్వాగతం పలికారు. అభిమానులు కూడా గజమాలతో స్వాగతించారు.. అలాగే వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లారు. అలా వేలాది మంది అభిమానుల మధ్య శిల్పా రవి ఇంటికి వెళ్లారు.