Mudragada | పిఠాపురం.. ఏపీ ప్రజలకు ముద్రగడ పిలుపు.. వైఎస్ జగన్ను దీవించాలన్న కాపు నేత
Mudragada | పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పీఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
Mudragada | ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి పాలనలో ఐదేండ్లుగా పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పిఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. గత ఐదేండ్లుగా పేదలు ఐదు వేళ్లతో త్రుప్తిగా అన్నం తినడంతోపాటు పేదల పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడే పరిస్థితి, అందరికీ మెరుగైన వైద్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, ఆయన్ను గౌరవించాలని పిలుపునిచ్చారు.
తాను ఎంతో మంది సీఎంల వద్ద పని చేశానని, ఒక్క ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారు తప్ప, పేదల ఆకలి తీర్చే ఆలోచన ఎవరూ చేయలేదని ముద్రగడ పేర్కొన్నారు. ఏ సీఎం కూడా దేశంలో ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టలేదని గుర్తు చేశారు. ప్రతి ఇంటిలోనూ ఫ్యాన్లు ఉంటాయని ముద్రగడ తెలిపారు. అందరి ఇండ్లలో ఫ్యాన్లు ఉండటంతో చల్లని గాలి స్వీకరిస్తున్నామని, అదే ఫ్యాన్ గుర్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదని, అందరూ ప్రేమతో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి ప్రేమతో ఆశీర్వదించాలని కోరారు.
ప్రతి ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయన్న ముద్రగడ.. గతంలో గాజు గ్లాసు పగిలిపోయి ఆ ముక్కలు అందరికీ హాని కలిగిస్తాయని, అందరూ గాజు గ్లాసుకు బదులు స్టీల్ గ్లాసులు వాడుతున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ వాడే వారని, ఇప్పుడు ఆ సైకిల్ తుప్పు పట్టడంతో ఎవరూ సైకిల్ వాడటం లేదని మోటారు సైకిళ్లు, కార్లు వాడుతున్నారని పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వత నష్టపోతామని ముద్రగడ వ్యాఖ్యానించారు. తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారని, గతంలో వారి రాక్షస పాలనకు సంబంధించిన వీడియోలను ఫేస్ బుక్, వాట్సాప్ ల్లో పోస్ట్ చేశానని, వాటిని చూడాలని కోరారు. గత పాలకులు ఐదేండ్లుగా చేసిన పాపాలకు బీజేపీ మినహా కూటమి పార్టీలన్నీ సముద్ర గర్భంలో ఉన్నాయని, ఆ పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

