Good Bad Ugly | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ అజిత్ కుమార్ (Ajith kumar). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అజిత్ కుమార్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరోపియన్ కంట్రీ బల్గేరియాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అజిత్‌కుమార్, యోగిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌తో షూటింగ్ లొకేషన్లో దిగిన ఫొటో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాకు పాపులర్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్‌కు టీంలోకి వెల్కమ్ చెబుతూ.. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ముందుగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పేరు తెరపైకి రాగా.. ఇప్పుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ను రీప్లేస్ చేశారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని 2025 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, జాన్ అబ్రహాం పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు రాగా.. మేకర్స్ ఇంకా ఎవరిని ఫైనల్ చేశారనేది క్లారిటీ రావాల్సి ఉంది. అజిత్ కుమార్ మరోవైపు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమా చేస్తున్నాడు. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Hot and happening @gvprakash to do music for #AK’s #GoodBadUgly pic.twitter.com/oHphmc5sEJ
— Sreedhar Pillai (@sri50) November 24, 2024
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన