Euphoria Teaser | టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న చిత్రం యుఫోరియా (Euphoria). హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న యువతి ఆ మత్తులో మెట్రో ట్రైన్‌లోకి వచ్చి..తనేం చేస్తుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయిన విజువల్స్‌తో కట్ చేసిన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇక్కడ ఏం జరిగింది..? బాయ్స్ మీరంతా ఏం చేశారు..నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానో.. మీకు తెలుసా..? అంటూ పోలీసాఫీసర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఓ కేసు విషయాన్ని సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న సన్నివేశాలతో షురూ అయింది టీజర్. మీకు ఏం తెలియదు.. నన్ను నమ్మండి అంటూ సాగుతున్న సంభాషణలు సినిమా ఏదో మిస్టరీని చేధించే నేపథ్యంలో ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. మొత్తానికి గుణశేఖర్ ఈసారి యూత్‌ను ఆలోచింప జేసేలా బలమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఈ మూవీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ జయదేవ్ నాయర్ పాత్రలో నటిస్తున్నాడు. యువత మత్తు పదార్థాల మోజులో పడటం ఎలాంటి పర్యావసానాలకు దారితీసిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గుణ శేఖర్ ఇప్పటికే గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో భూమికా చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. గుణశేఖర్ తన కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త కథాంశంతో సమకాలీన సామాజిక సమస్యలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
యుఫోరియా టీజర్..
Raj – Samantha | రెండో పెళ్లికి రెడీ అయిన సమంత.. ఆ పోస్ట్‌తో వచ్చిన పూర్తి క్లారిటీ
Yellamma | ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌పై దిల్ రాజు క్లారిటీ… హీరో, హీరోయిన్ల విషయంలో తొలగిన సస్పెన్స్