Raj – Samantha | టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్‌గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత సామ్‌కు వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి హిట్ అందిపుచ్చుకోవడం ఆమెకి స్టార్డమ్ తెచ్చిపెట్టింది.మధ్యలో మయోసైటిస్ వలన సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది.ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతుంది. సమంత ఇప్పుడు హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరీయెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. అడపాదడపా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ సత్తా చాటుతుంది.
గత కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు జంట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మధ్య రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్లో కలిసి హాజరవడం, ఆ తర్వాత ఒకే కారులో కలిసి కనిపించడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అయితే గత కొంత కాలంగా రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు కోయంబత్తూరులోని ఈషా యోగ సెంటర్ లో వీళ్లిద్దరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం రాజ్ భార్య శ్యామలీ పెట్టిన ఓ పోస్ట్ . అందులో తెగించిన వ్యక్తులే అలాంటి పనులు చేస్తారు అని రాయడంతో రాజ్-సమంత పెళ్లి గురించే ఇలాంటి పోస్ట్ పెట్టిందని ముచ్చటించుకుంటున్నారు.
ఇక సమంత ఇటీవల నిర్మాతగా ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అయింది. వెబ్ సిరీస్‌లు, ఇతర ప్రాజెక్టులతో అభిమానులని పలకరిస్తూ తెగ సందడి చేస్తుంది. అయితే సమంత నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చిన సమంత తిరిగి మళ్లీ బిజీ అయింది. ప్రస్తుతం ఆమె “మా ఇంటి బంగారం” అనే చిత్రంతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను రాజ్ & డీకేలు తెరకెక్కిస్తుండగా, ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.