టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు గోపీచంద్ (Gopichand), తమన్నా (Tamannaah) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సీటీమార్. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది (Sampath Nandi) దర్శకుడు. కాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒక ఊరు నుంచి ఎనిమిది ప్లేయర్స్..మీకు రూల్స్ తెలుసు కదా..కబడ్డీ స్పోర్ట్స్ ఆర్గనైజర్ అడుగుతుంటే రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్..రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్ లో వస్తారు సార్.
త్వరలో నేషనల్ కబడ్డీ గేమ్ వస్తోంది. అందులో గెలిచి చూపిస్తే దేశం మొత్తం మన గురించే ఆలోచిస్తుంది అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్ తో మొదలయ్యే ట్రైలర్ ఆడపిల్లలకు కావాల్సింది బయటకు వెళ్లేటపుడు మగాడితోడు కాదు..ధైర్యం అనే తోడు అంటూ గోపీచంద్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. గోపీచంద్ ఆంధ్రా మహిళల టీం కబడ్డీ కోచ్ గా, తమన్నా తెలంగాణ మహిళల టీం కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నారు.
ఈ ఇద్దరూ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తమ టీమ్స్ ను గెలిపించే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళల టీం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని కప్ ఎలా గెలిచారన్నది సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం సెప్టెంబర్ 10న సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుంది. ఇప్పటికే మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర