The Journey of Viswam | ఈ ఏడాది భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. గోపీచంద్ చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో నటిస్తున్న మూవీ Gopichand 32. విశ్వం టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్‌లో తెగిపడటం.. తెగించగలడం క్రమాన ఫలితం.. విధాత విశ్వం అంటూ గూస్బంప్స్ తెప్పించే టైటిల్ ట్రాక్ గోపీచంద్‌ను కొత్త గెటప్‌లో చూపిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం వీడియోను షేర్ చేశారు మేకర్స్. శ్రీను వైట్ల నుంచి ప్రేక్షకులు ఆశించే ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు తాజా వీడియోతో క్లారిటీ వస్తోంది. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తు్న్నారు. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అంటూ హిందీలో డైలాగ్ చెబుతూ ఇప్పటికే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు గోపీచంద్.
విశ్వంలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. గోపీచంద్ ఈ సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనింగ్ రోల్‌తో రాబోతున్నట్టు ఫస్ట్ స్ట్రైక్‌తో అర్థమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లో వస్తున్న తొలి సినిమా ఇది.
An Adventure with a Scenic Vistas, intense action & hilarious moments..!
The Journey of #Viswam is here
– https://t.co/X2nziQEdlxSee you all soon in cinemas…@SreenuVaitla @peoplemediafcy
— Gopichand (@YoursGopichand) July 31, 2024
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్