‘సినిమా అంటే ఇష్టం. అందుకే నిర్మాణరంగంలోకి వచ్చాను. మంచి కథకోసం చూస్తుంటే దర్శకుడు సుభాష్‌చంద్ర ఈ కథ చెప్పారు. యూనివర్సల్‌గా అందరికీ కనెక్టయ్యే ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయి. అందుకే ఈ కథతో నిర్మాతనయ్యాను’ అని నిర్మాత అభినవ్ అన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా ఆయన నిర్మించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. సుభాష్‌చంద్ర దర్శకుడు. నిధి ప్రదీప్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రధారి. ఈ నెల 8న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్మాత అభినవ్ విలేకరులతో మాట్లాడారు.
‘నేటివిటీకి దగ్గరగా, అందరికీ కనెక్టయ్యేలా ఉందని ఈ టైటిల్‌ని నేనే డైరెక్టర్‌కి సజెస్ట్ చేశాను. పక్కా తెలంగాణ కుర్రాడైన సుమంత్ ప్రభాస్ ఈ పాత్ర కోసం గోదారి యాసని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు. ఛాలెంజ్‌గా తీసుకొని అద్భుతంగా నటించాడు. జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల వంటి అనుభవం ఉన్న నటీనటులు నా తొలి సినిమాలో భాగం కావడం అదృష్టం. ఇక దర్శకుడు సుభాష్ టెక్నికల్‌గా స్ట్రాంగ్. ప్రతిదీ డీటెయిల్‌గా ప్లాన్ చేసుకొని ఈ సినిమా చేశారు. వినోదం, భావోద్వేగాలు, డ్రామా అన్నీ ఉండే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా బావుంటుంది’ అని తెలిపారు. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ సునీల్‌తో కలిసి తామే స్వయంగా విడుదల చేస్తున్నామని, అలాగే సీడెడ్‌లో తిరుపతి ప్రసాద్, ఆంధ్రలో సురేశ్‌బాబు రిలీజ్ చేస్తున్నారని, ఈ నెల 7న సాయంత్రం ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత అభినవ్ తెలిపారు.