Ghantasala The Great | సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు దివంగత లెజెండరీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు (ఘంటసాల). ఆయనపై వస్తున్న బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. సీహెచ్ రామారావు రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సింగర్ కృష్ణచైతన్య టైటిల్ రోల్లో నటిస్తుండగా.. సావిత్రమ్మగా మృదుల ఘంటసాల, చిన్న ఘంటసాలగా తులసీ ఫేం అతులిత నటించగా.. సుమన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీని డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఘంటసా పాత్రలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన పాటలు వింటూ పెరిగిన నేను ఆయన బయోపిక్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఘంటసాల ప్రయాణాన్ని చూస్తారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారన్నాడు. ఇక చాలా ఎమోషనల్‌గా సాగేలా ఘంటసాల స్క్రిప్ట్ ఉంటుందని.. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడాలని ఆదిత్య హాసన్ అన్నాడు.
పాట అని అనగానే అందరికీ ఘంటసాల గుర్తుకొస్తారు. సింగర్‌గా కంటే ఘంటసాల వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియజేయాలని ఈ సినిమా తెరకెక్కించానన్నాడు డైరెక్టర్ రామారావు. స్వరాభిషేకంలో కృష్ణచైతన్యను చూసిన తర్వాత వారిలో ఘంటసాల కనిపించారు. అలా ఈ పాత్రలో కృష్ణచైతన్యను ఎంపిక చేసినట్టు చెప్పాడు. ఈ చిత్రాన్ని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో సీహెచ్ ఫణి నిర్మిస్తున్నారు.
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!